హైదరాబాద్, వెలుగు: డిజిటల్ ల్యాండింగ్ ప్లాట్‌ఫామ్ ఎంపాకెట్ నటుడు నవీన్ పోలిశెట్టిని తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. నాన్‌స్టాప్ గ్రోత్ పేరుతో కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఆయన ఎన్నో ఆడిషన్లు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగారని, ఈ ప్రయాణమే యువతకు స్ఫూర్తినిస్తుందని సంస్థ పేర్కొంది.
సులభంగా డిజిటల్ లోన్లు అందించే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని రూపొందించారు. ఇప్పటివరకు 65 లక్షల మందికి పైగా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రయోజనం పొందారు. యువత ఆర్థిక అవసరాలను తీర్చడంలో ఈ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ముందుంటుందని సీఈఓ గౌరవ్ తెలిపారు
