పెగాసిస్టమ్స్ నేషనల్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్

పెగాసిస్టమ్స్ నేషనల్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్

హైదరాబాద్​, వెలుగు: యువతకు అత్యాధునిక ఏఐ రంగంలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు టెక్నాలజీ సంస్థ పెగాసిస్టమ్స్ నేషనల్ ఇంటర్న్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌ను నిర్వహిస్తోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి , స్మార్ట్‌‌‌‌బ్రిడ్జ్ సంస్థల సహకారంతో ఈ ఐదు వారాల వర్చువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌‌‌‌ను తయారు చేశారు.  

కేవలం పది రోజుల్లో 10 వేలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి.  దీనిద్వారా దేశంలోని దాదాపు 15 వందల కాలేజీలకు చెందిన సుమారు 75 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది.  ఏఐ  అన్ని రంగాలను పూర్తిగా మారుస్తున్న సమయంలో, విద్యార్థులను పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. 

ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు జనరేటివ్ ఏఐ, పెగా బ్లూప్రింట్, ఏజెంటిక్ ఇంజనీరింగ్, వర్క్‌‌‌‌ఫ్లో ఆటోమేషన్ , ఎంటర్‌‌‌‌ప్రైజ్ ట్రాన్స్‌‌‌‌ఫర్మేషన్ వంటి అత్యాధునిక అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.