న్యూఢిల్లీ: స్టీల్ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్‌లో 683 మిలియన్ డాలర్ల (రూ.6,557 కోట్ల) నికర లాభాన్ని సాధించింది. గతేడాది ఇదే సమయంలో వచ్చిన 1.79 బిలియన్ డాలర్ల (రూ.17,184 కోట్ల) తో పోలిస్తే లాభం 62శాతం తగ్గింది. అయితే, స్టీల్ ధరలు, ఎగుమతులు పెరగడంతో జనవరి–మార్చి క్వార్టర్ కంటే లాభం 19శాతం పెరిగింది.
ఆదాయం ఏడాది ప్రాతిపదికన 16.8 బిలియన్ డాలర్ల (రూ.1.61 లక్షల కోట్ల)కు చేరుకుంది. భారతదేశంలోని జాయింట్ వెంచర్ ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఏఎంఎన్‌ఎస్ ఇండియా) మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జూన్ క్వార్టర్‌లో కంపెనీ ఇబిటా (ట్యాక్స్‌లు, వడ్డీలకు ముందు లాభం) రూ.2,467 కోట్లకు, ఆదాయం 1.7 బిలియన్ డాలర్ల (రూ.16,320 కోట్ల) కు
పెరిగాయి.
