హైదరాబాద్, వెలుగు: హోం ఫ్రాగ్రెన్స్ తయారీ బ్రాండ్ ఓడోనిల్ కార్లలో వాడే సువాసనల విభాగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లో శుక్రవారం ఈ కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కార్లలో ప్రయాణించేటప్పుడు సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ ప్రీమియం ఉత్పత్తులను రూపొందించారు.
ఈ కొత్త శ్రేణిలో ఓషన్ బ్రీజ్ , రూబీ మిస్ట్ అనే వేరియంట్లు ఉంటాయి. ఈ ఉత్పత్తులు ఏకంగా 45 రోజుల పాటు నిరంతరం సువాసనను వెదజల్లుతాయి. ఒడోనిల్ కార్ ఫ్రాగ్రెన్స్‌లో యాంటీ స్మోక్ టెక్నాలజీని , ఫ్రేగ్రెన్స్ ఇంటెన్సిటీ కంట్రోల్ ఫీచర్‌ను అమర్చారు. దీనివల్ల కార్లలోని దుర్వాసనలు, సిగరెట్ పొగ వాసన పూర్తిగా తొలగిపోతాయి. ధరలు రూ.99 నుంచి మొదలవుతాయని కంపెనీ తెలిపింది.
