ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ మరోనాలుగు నెలలు పెంపు

ఎల్ఆర్ఎస్ ఫీజు రాయితీ మరోనాలుగు నెలలు పెంపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనధికార, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎల్ఆర్ఎస్​ ఫీజు చార్జీలపై 25 శాతం రాయితీ పొందేందుకు మరో నాలుగు నెలలపాటు గడువు పెంచుతూ జీవో 213 రిలీజ్​ చేసింది. నేటి నుంచి నవంబర్​ 30 వరకు గడువు పెంచింది.

రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ, సైబరాబాద్​, మల్కాజ్​ గిరి కార్పొరేషన్ల పరిధిలోని అన్ని లే అవుట్​ ఫ్లాట్లకు ఫీజులు చెల్లించే వారంతా ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 25 శాతం రాయితీ ఇస్తూ మూడు నెలల పాటు పెంచిన గడువు జూలై 31తో ముగిసింది. దీంతో మరో సారి నాలుగు నెలల పాటు గడువు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.