అమ్మకు ఇచ్చిన మాట

అమ్మకు ఇచ్చిన మాట

తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనదైన నటనతో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అభిరామి. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. వాటిలో సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న  ‘సుధీర్స్ జోకర్’ ఒకటి.  ఈ చిత్రంలో అభిరామి కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలియజేస్తూ  తన క్యారెక్టర్‌‌‌‌ ఫస్ట్ లుక్‌‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో  గాయత్రీ దేవి అనే పాత్రలో ఆమె కనిపించనున్నట్టు రివీల్ చేశారు.  అమ్మగా కొడుకు చేత ప్రామిస్ చేయించుకుంటున్న ఈ పోస్టర్ ఆకట్టుకుంది.

దీనిమీద  ‘అమ్మకు ఇచ్చిన మాట చిరకాలం మిగిలిపోతుంది..’  అని క్యాప్షన్ ఉండటం హార్ట్ టచింగ్‌‌గా ఉంది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో ‘బిగ్ బాస్‌‌’ ఫేమ్  అయేషా  హీరోయిన్‌‌గా పరిచయం  అవుతోంది.  మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  శ్రీనివాసులు పి.వి., విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు.