జ్యోతిష్యం : ఆగస్టు నెల.. గ్రహా సంచారంలో మార్పులు... మిథునరాశి వారి జాతకం ఇదే..!

జ్యోతిష్యం  :  ఆగస్టు నెల.. గ్రహా సంచారంలో మార్పులు... మిథునరాశి వారి జాతకం ఇదే..!

ఆగస్టు 2026 చాలా కీలకంకానుంది.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. కీలక గ్రహాల సంచారంలో మార్పులు ఉంటాయి. సూర్యుడు, బుధుడు, కుజుడు గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  మొత్తంగా ఈ రాశి వారు ఆగస్టు నెలలో ఎలాంటి పరిహారాలు చేయాలి.. ఈ రాశి వారికి ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

ఆగస్టు 2026 లో సూర్యుడు, బుధుడు, కుజుడు గ్రహాల సంచారం వలన మిథున రాశి వారికి ఈ నెలంతా చాలా అద్భుతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  కుటంబ జీవితం... ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్ఠలు పెరుగుతాయి.   వృత్తి, వ్యాపారాలు అనుకూల ఫలితాలనిస్తాయి.  . అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. 

ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. అధికారులకు మీ సలహాలు బాగా పనికి వస్తాయి.విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధి స్తారు. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.  పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు లాభాల సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ధన సంబంధిత విషయాలలో మీకు ఊహించని విజయం లభిస్తుంది. అలాగే మీరు దీర్ఘకాలంగా చేసిన కఠోర శ్రమకు ఫలితాలు పొందుతారు.

ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగపరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొందరు మిత్రుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

పరిహారాలు:  గురువారం రోజు దక్షిణామూర్తి స్త్రోత్తం పారాయణం లేదా వినడం.. ఆవుకు తోటకూర ఆహారంగా ఇవ్వడం

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.