ఘనంగా గీతం యూనివర్సిటీ ‘అచీవర్స్' డే

ఘనంగా గీతం యూనివర్సిటీ ‘అచీవర్స్' డే

రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం యూనివర్సిటీ ‘అచీవర్స్'’ డే కార్యక్రమాన్ని శుక్రవారం వర్సిటీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. గీతం కెరీర్​ గైడెన్స్​ సెంటర్ ఆధ్వర్యంలో క్యాంపస్​ ప్లేస్​మెంట్స్​ సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా నియామక సర్టిఫికెట్లు అందజేశారు. పీడబ్యూసీ ఏసీ డైరెక్టర్​అండ్​ చీఫ్ ఆపరేషన్స్​ లీడర్​ జీటీ కృష్ణ చైతన్య, టీసీఎస్​ ప్రాంతీయ అధిపతి రిచర్డ్​ కింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గీతం వీసీ ప్రొఫెసర్​ డీఎస్​ రావు మాట్లాడుతూ శనివారం నిర్వహించే గీతం గ్రాడ్యుయేషన్​ డేలో 2026 బ్యాచ్ ప్లేస్​మెంట్స్​ సాధించిన 771 మందికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. గీతం స్కూల్​ఆఫ్​ బిజినెస్​ ఓవరాల్​ 97.5 శాతం నియామకాలు సాధించిందని, అండర్​ గ్రాడ్యుయేషన్​ వంద శాతం, ఆర్కిటెక్చర్​ 95.8 శాతం నమోదు చేసిందని తెలిపారు. వివిధ విభాగాల అధిపతులు, గీతం ప్రొఫెసర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.