జపాన్ కంపెనీతో ఐస్ మేక్ జేవీ

జపాన్ కంపెనీతో ఐస్ మేక్ జేవీ

హైదరాబాద్​, వెలుగు: పారిశ్రామిక , వాణిజ్య రిఫ్రిజరేషన్ సేవలు అందించే హైదరాబాద్​ కంపెనీ ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ జపాన్‌‌‌‌కు చెందిన గెలిలీ హోల్డింగ్స్​తో  జాయింట్ వెంచర్‌‌‌‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.  గెలిలీ  ఐస్ మేక్​లో రూ.180 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.  అదనంగా ఇతర సంస్థల నుంచి మరో రూ.10 కోట్లను కూడా వ్యాపార విస్తరణకు ఉపయోగించనున్నారు. 

జేవీలో గెలిలీకి 60 శాతం, ఐస్ మేక్​కుకు 40 శాతం వాటా ఉంటుంది. ఈ నూతన సంస్థ ద్వారా కమర్షియల్ ఫ్రిజ్​లు , అత్యాధునిక కోల్డ్ చైన్ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ ,పంపిణీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచడానికి , అత్యాధునిక టెక్నాలజీ కోసం కొంత డబ్బును వినియోగిస్తారు.  కొత్త కార్పొరేట్ ఆఫీసు నిర్మాణం, ఆర్​అండ్​సెంటర్, ల్యాబ్స్‌‌‌‌ను కూడా  నిర్మిస్తారు.