కరీంనగర్ టౌన్, వెలుగు: అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వూట్కూరి నరేందర్ రెడ్డికి ప్రతిష్టాత్మక సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటుదక్కింది. శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో నిర్వహించిన అభినందన సభలో నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యారంగంలో విశిష్ట సేవలు, నాయకత్వం, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల సాధికారత, విద్యాసంస్థల అభివృద్ధి, సామాజిక సేవల పట్ల అంకితభావాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు వెల్లడించారు. విద్యారంగంలో చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అంతర్జాతీయ గౌరవం లభించడం అల్ఫోర్స్ విద్యా సంస్థలు అవలంబిస్తున్న విద్యా విధానానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, టీచర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
