హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించనున్న స్పెషల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు 21,721 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినట్లు టెట్ కన్వీనర్ జి. రమేశ్తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో పేపర్-1కు 2,564 మంది, పేపర్-2కు 15,718 మంది, రెండు పేపర్లకు 3,439 మంది ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లకు ప్రమోషన్లు పొందాలన్నా, సర్వీసులో కొనసాగాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఇన్‌సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా ఈ స్పెషల్ టెట్ నిర్వహిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో పరీక్ష ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులు దృష్టి పెట్టారు. సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆన్‌లైన్ విధానంలో స్పెషల్ టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
