- దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు వెంటనే రిపేర్లు చేయాలి
నిర్మల్, వెలుగు: భారీ వర్షాల పట్ల ప్రజలు, సంబంధిత అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రాజెక్టుల పరిస్థితి, పంటల సాగు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై ఆయన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధికారులతో రివ్యూ నిర్వహించారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు వెంటనే రిపేర్లు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు పంట మార్పిడి విధానాలపైవిస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ కలెక్టర్లు బి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజేశ్వర్, కిశోర్ కుమార్, డీఆర్వో రాథోడ్ రమేశ్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దోచుకుంటోంది
ఆర్మూర్, వెలుగు: బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నలుగురికి దోచి పెడుతోందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆర్మూర్‌లో కాంగ్రెస్ఆధ్వర్యంలో సర్‌పై కాంగ్రెస్ బీఎల్ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనే అమలవుతున్నాయని అన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకుతున్న కేసీఆర్ కుటుంబీకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్నగేశ్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మానాల మోహన్‌రెడ్డి, ముత్యాల సునీల్, అరికెల నర్సారెడ్డి, ఆకుల లలిత, తాహెర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు.
