లక్ష్మణచాంద: 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి పరామర్శ

లక్ష్మణచాంద: 3 కిలోమీటర్లు నడిచి వెళ్లి పరామర్శ

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడానికి చేరుకోవాలంటే కాలి నడకే దిక్కు. వాగులు, ఒర్రెలు దాటి వెళ్లాల్సిందే. భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్​చార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. 

గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. సర్పంచ్ లు మోతీబాయి భీంరావ్, రాథోడ్ సోనియా, భూమ్ రెడ్డి, భీమేశ్, మాజీ ఎంపీపీ జైసింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్‌‌‌‌‌‌‌‌ తదితరులు ఉన్నారు.