ఖానాపూర్, వెలుగు: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్, ఇద్దరు నర్సింగ్ ఆఫీసర్లను ప్రభుత్వం అకారణంగా సస్పెండ్ చేసిందని, వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీనివాసాచారి డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట వైద్య సిబ్బంది నిరసన తెలిపారు.
శ్రీనివాసాచారి మాట్లాడుతూ.. బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో జరిగిన ఓ ఘటనలో డాక్టర్, నర్సింగ్ ఆఫీసర్ల తప్పు లేకున్నా ఈ ఘటనకు వారిని బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం బాధాకరమన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో విధులు నిర్వహిస్తామని తెలిపారు. నర్సింగ్ సూపరింటెండెంట్ సంజిత రాణి తదితరులు పాల్గొన్నారు.
