గద్వాల, వెలుగు: ఎన్యూమరేషన్ ఫారాలు ఫిలప్ చేసి ఇస్తేనే ఓటరుగా నమోదు చేస్తారని జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. శుక్రవారం గద్వాల టౌన్ లోని 17వ వార్డు భీమ్ నగర్ రెవెన్యూ కాలనీలో ‘సర్’లో భాగంగా ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగిచ్చేందుకు మూడు రోజుల గడువే ఉందని, ఇవ్వనివారు త్వరగా ఇవ్వాలని, లేకపోతే ఓటు హక్కు కోల్పోతారని చెప్పారు.
