- రవీందర్ సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
- డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: కేంద్రమంత్రి బండి సంజయ్ పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కరీంనగర్డిప్యూటీ మేయర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు హెచ్చరించారు. శుక్రవారం ఓ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా కరీంనగర్ ను అభివృద్ధి చేసిన బండి సంజయ్ పై అసత్య ఆరోపణలు చేసిన మాజీ మేయర్రవీందర్ సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన యూడీఎఫ్స్కీమ్లో రూ.137 కోట్ల ఎక్సెస్ టెండర్లలో రూ.40 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు.
ఇదే సంస్థకు బీఆర్ఎస్ హయాంలో రూ.6 వేల కోట్ల పనులు 5 శాతం ఎక్సెస్ టెండర్లతో పనులు ఎలా కట్టబెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేర్, గౌరవెళ్లి, తోటపల్లి, మల్లన్నసాగర్, భక్తరామదాసు ప్రాజెక్టు పనులు చేపడుతున్నది ఇదే సంస్థ కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో కార్పొరేటర్లు బండారి వేణు, వంగల పవన్, వి.సత్యనారాయణరెడ్డి, లీడర్లు మొండయ్య, శ్రీనివాస్, నాగరాజు, వాసు, భాస్కర్, హమీద్, రాజ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
