మెదక్, వెలుగు: జూలై నెలంతా మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో కొనసాగిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 112 మంది బాల కార్మికులను రక్షించి, వారిని పనిలో పెట్టుకున్న యజమానులపై 75 కేసులు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ శుక్రవారం తెలిపారు.
మరో సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు, బాలికల భద్రత కోసం షీ టీం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 9 మందిపై ఈ-పెట్టీ కేసులు నమోదు చేయడంతో పాటు, జిల్లా వ్యాప్తంగా 46 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
