ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన 'ఏజ్ గ్యాప్' అంశంపై నటి అషికా రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రవితేజతో కలిసి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఈ బ్యూటీ నటిస్తోంది. అయితే ప్రమోషన్ లో భాగంగా ఈ బ్యూటీ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వయసుతో పనిలేదు.. కథే బలం..
రవితేజతో ఏజ్ గ్యాప్ ట్రోల్స్.. గట్టిగా కౌంటర్ ఇచ్చింది అషికా. తన సహనటుడి వయసు ఆధారంగా సినిమాలు ఎంచుకోనని స్పష్టం చేశారు. కథలో తన పాత్ర ఎంత బలంగా, అర్థవంతంగా ఉందన్నదే తనకు ము ఖ్యమని తెలిపారు. సీనియర్ నటులతో కలిసి పని చేయడం ద్వారా సెట్స్ పై డిసిప్లిన్, టైమింగ్, ప్రొఫెషనలిజం నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. 2016లో కన్నడ ఇండస్ట్రీ లో 'క్రేజీ బాయ్'తో కెరీర్ ప్రారంభించిన అషికా క్రమంగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ నిలకడైన కెరీర్ నిర్మించుకుంది.
హిట్ కొట్టేనా.?.
కన్నడ, తెలుగు సినిమాల్లో నటిస్తూ నాగార్జున, సిద్ధార్థ్, నందమూరి కల్యాణ్ రామ్ వంటి ప్రముఖులతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. భాషలు, ఇండస్టీలు మారినా తనను తాను ఆడాప్ట్ చేసుకునే సామర్థ్యం ఆమెకు విస్తృత ప్రేక్షకాదరణ తెచ్చిపెట్టింది. 'భర్ల మహాశయులకు విజ్ఞప్తి' విషయానికి వస్తే, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రవితేజ సరసన లీడ్ రోల్ లో నటిస్తోంది. సంక్రాంతికి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ అభిమానులను ఎంతో ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలను పెంచాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
