KatrinaVicky: తనయుడి పేరు ప్రకటించిన విక్కీ-కత్రినా కైఫ్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా!

KatrinaVicky: తనయుడి పేరు ప్రకటించిన విక్కీ-కత్రినా కైఫ్.. ఆ పేరు వెనుక అంత అర్థం ఉందా!

బాలీవుడ్ క్యూట్ కపుల్ కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్ తమ ముద్దుల తనయుడిని ప్రపంచానికి పరిచయం చేశారు. నవంబర్ 7, 2025న జన్మించిన ఈ చిన్నారికి 'విహాన్ కౌశల్' (Vihaan Kaushal) అని నామకరణం చేసినట్లు ఈ రోజు ( జనవరి 7, 2026 ) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఈ జంట పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మా జీవితాల్లో వెలుగు 

చిన్నారి విహాన్ చేతిని కత్రినా, విక్కీ పట్టుకున్న ఒక క్యూట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మా కిరణం.. విహాన్ కౌశల్ . మా ప్రార్థనలు ఫలించాయి.  జీవితం చాలా అందంగా ఉంది. మా ప్రపంచం ఒక్క క్షణంలో మారిపోయంది. మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతతో ఉన్నాం.. అని పోస్ట్ లో రాసుకోచ్చారు. ఈ పోస్ట్ తో మెగాస్టార్ చిరంజీవి మొదలు కొని బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణే వరకూ అందరూ అభినందనలు కురిపిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

పేరు వెనుక ప్రత్యేకత ఏమిటి?

'విహాన్' అనే పదానికి సంస్కృతంలో 'సూర్యోదయం' లేదా 'కొత్త ఆరంభం' అని అర్థం. అయితే ఈ పేరు వెనుక ఒక ఆసక్తికరమైన సినిమా కనెక్షన్ కూడా ఉంది. 2019లో విక్కీ కౌశల్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన బ్లాక్ బస్టర్ హిట్ 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్'లో ఆయన పాత్ర పేరు మేజర్ విహాన్ సింగ్ షెర్గిల్. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ పాత్ర పేరునే తన కొడుకుకు పెట్టుకోవడం విక్కీ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

సంఖ్య '7'తో ఉన్న విడదీయలేని బంధం

విక్కీ-కత్రినా జీవితంలో 7 అనే అంకెకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లు కనిపిస్తోంది. విక్కీ కౌశల్ పుట్టినతేదీ మే 16 (1+6=7) అదే విధంగా కత్రినా కైఫ్ పుట్టినతేదీ జూలై 16 (1+6=7),  ఇప్పుడు వారి బాబు విహాన్ కౌశల్ పుట్టింది నవంబర్ 7వ తేదీన. బాబు పేరును అధికారికంగా ప్రకటించింది కూడా జనవరి 7వ తేదీనే కావడం విశేషం!

►ALSO READ | రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్.. ఏపీలో వెయ్యి రూపాయలు.. జీవో విడుదల

కత్రినా కైఫ్ 42 ఏళ్ల వయసులో తల్లి కావడంతో, వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని, మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో ఒక మధురమైన అనుభూతి అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి 'విహాన్' రాకతో విక్కీ-కత్రినా ఇల్లు సరికొత్త వెలుగులతో నిండిపోయిందని అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.