దేశంలోని వాహనదారులు కొత్త ఏడాది నుండి ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కేంద్రం ఫిబ్రవరి 1 నుండి ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చేస్తోంది. రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఈ నియమాన్ని ప్రకటించగా, ఒడిశా రవాణా శాఖ దీనిని మొదట అమలు చేయాలని రాష్ట్ర రవాణా అథారిటీ (STA)ని ఆదేశించింది. దీనికి సంబంధించిన గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవే...
1. ఫాస్టాగ్ (FASTag) రీఛార్జ్ కట్
మీ వాహనానికి సంబంధించి ఇన్సూరెన్స్ (బీమా) వాలిడిటీ అయిపోయిన/సరిగ్గా లేకపోతే మీ ఫాస్టాగ్ రీఛార్జ్ అవ్వదు ఇంకా పనిచేయదు. అలాగే పొల్యూషన్ సర్టిఫికేట్ (PUCC) తప్పనిసరి ఉండాలి. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు అన్నీ కట్టేయాలి. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా టోల్ ప్లాజాల వద్దకు వెళ్తే, మీరు భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది.
2. ట్రాకింగ్ డివైజెస్ తప్పనిసరి (VLTD)
జనవరి 1 నుండి టాక్సీలు, వ్యాన్లు, బస్సులు, ట్రక్కులు సహా నేషనల్ పర్మిట్లు ఉన్న వాణిజ్య వాహనాలు తప్పనిసరిగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజెస్ (VLTD) ఇన్‌స్టాల్ చేయాలి. ఈ డివైజ్ లేకుండా కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ లేదా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనుమతించారు.
►ALSO READ | మీకు.. ఇందిరా గాంధీకి ఇదే తేడా: ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఫైర్
3. ఏప్రిల్ 1 నుండి చెకింగ్స్
ఏప్రిల్ 1వ తేదీ నుండి వాహనాల ఫిట్‌నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ అధికారులు నేరుగా వాహనాన్నిఅపి చెక్ చేస్తారు. ఇన్సూరెన్స్ ఇంకా చలాన్లు క్లియర్ ఉంటేనే పర్మిట్లు జారీ చేస్తారు.
4. స్పీడ్ లిమిట్ సహా జరిమానాలు
రోడ్లపై సూచించిన స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో వెళ్తే రూ. 2,000 వరకు జరిమానా విధిస్తారు. అయితే, చాలా రోడ్లపై స్పీడ్ లిమిట్ బోర్డులు లేవని వాహనదారులు విమర్శిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం వెంటనే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒడిశా సహా భారతదేశం అంతటా సురక్షితమైన, పరిశుభ్రమైన, మరింత నిబద్దతతో రోడ్డు రవాణా కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ కొత్త చర్యలు హైలైట్ చేస్తున్నాయి.
