సినీ నటుడు సురేష్ కుమార్ ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానటి, గోల్కొండ హైస్కూల్, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి చిత్రాల్లో ఆయన నటించారు.
మూడు దశాబ్ధాలకు పైగా మల్టీ నేషనల్ బ్యాంకుల్లో ఉన్నత పదవుల్లో పనిచేస్తూనే.. నటనపై ఆసక్తితో నాటక, సినీ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ థియేటర్ గ్రూపుల్లో కీలక సభ్యుడిగా కొనసాగుతూ తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో నాటకాలు ప్రదర్శించారు. అలాగే సర్కార్ రాజ్, మద్రాస్ కేఫ్, మోడ్ లాంటి హిందీ చిత్రాల్లో ఆయన నటించారు.
