శ్రీలంకలో ఎమర్జెన్సీ: మరో పేలుడుతో హై అలర్ట్

శ్రీలంకలో ఎమర్జెన్సీ: మరో పేలుడుతో హై అలర్ట్

వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన శ్రీలంకలోఎటుచూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. ఆదివారం ఈస్టర్ వేడుకలు జరుగుతుండగామూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు, ఓజూపార్క్ , ఓ హౌసిం గ్ కాంప్లెక్స్ లో పేలుళ్లుజరిగిన విషయం తెలిసిందే. పేలుళ్లు జరిగిన ఎనిమిది ప్రాంతాల్లో సోమవారం కూడా సహాయచర్యలు కొనసాగాయి. మృతుల సంఖ్య 290కిచేరింది. మరో 500 మందికిపైగా క్షతగాత్రులు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా మరోచోట బాంబు పేలుడు కలకలంరేపింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆదివారం శ్రీలంక అంతటా కర్ఫ్యూ విధించగా.. దాన్నిసోమవారం ఉదయం ఎత్తివేశారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా సమావేశంలో సోమవారం అర్ధ్ర రాత్రి నుంచి దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలని నిర్ణయించారు. పలు ప్రధాన నగరాలు,చర్చిలు, ప్రముఖుల ఇళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి.

సెయింట్ ఆంటోనీ చర్చి దగ్గర మళ్లీ పేలుడు
కొలంబోలో తాజాగా మరో పేలుడు జరిగింది.ఇక్కడి సెయింట్ ఆంటోనీ చర్చి వద్ద ఆదివారంజరిగిన పేలుళ్లలో పలువురు ప్రాణాలు విడిచారు.సోమవారం ఉదయం చర్చి సమీంలోని ఓ వ్యాన్లో బాంబులు ఉన్నట్లు తెలిసి స్పెషల్ టాస్క్ ఫోర్స్సిబ్బంది నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో భారీ శబ్దం తో వ్యాన్​ పేలిపోయింది. అక్కడివారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పలువురు గాయపడ్డారు . అంతకు ముందుకొలంబోలోని మెయిన్​ బస్టాండ్‌‌‌‌లో 87 బాంబ్ డిటోనేటర్లను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆదివారం రాత్రి శ్రీలంక ఎయిర్ పోర్టు ప్రాంతంలోఆరు అడుగుల ఓ పైపు బాంబును కనుగొన్నారు. దాన్ని అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. మరిన్నిదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో దేశవ్యాప్తంగా ముమ్మరంగా సోదాలు జరుగుతున్నాయి.