
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)టాలీవుడ్,కోలీవుడ్ లో తన సహజ నటనతో ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నారు.హీరోగా,విలన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.విజయ్ సేతుపతికి ఇండస్ట్రీతో సంబంధం లేకుండా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే చాలు..ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ అయినా చూసేందుకు సిద్ధంగా ఉంటారు.అలాంటి విభిన్నమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి. రీసెంట్గా షారుఖ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ జవాన్ మూవీలో కూడా విలన్ గా చేసి ఆడియన్స్ ను అలరించారు విజయ్ సేతుపతి.
ఇదిలా ఉంటే..విజయ్ సేతుపతి తాజాగా 'ఏసీఈ'(ACE)అనే విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు.ఈ మూవీ క్రైమ్ కామెడీతో సరికొత్త థ్రిల్‌ను పెంచే ప్రయోగం అయ్యేలా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాను భారీ స్థాయిలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.
ఆరుముగ కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ క్రైమ్ కామెడీ చిత్రం నుండి..తాజాగా పోస్టర్‌తో పాటు టైటిల్ మోషన్ టీజర్ రిలీజ్ చేశారు.ఇందులో ప్రముఖ తమిళ కమెడియన్ యోగిబాబు కీ రోల్ లో కనిపిస్తున్నాడు.విజయ్ సేతుపతి యూత్‌ఫుల్ లుక్, స్మోకింగ్ పైప్ మరియు డైస్‌ల కారణంగా టీజర్ మరింత ఆసక్తిని పెంచేస్తుంది.
అలాగే ప్రతి క్యారెక్టర్,వారి యొక్క వ్యసనాలను రివీల్ చేస్తూ..జూదం,తుపాకులు,పేలుళ్లు,దోపిడీలు మరియు బైక్ ఛేజింగ్ వంటి అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇక దీన్ని బట్టి చూస్తే..సినిమా వినోదభరితమైన క్రైమ్-కామెడీ థ్రిల్లర్‌గా ఉంటుందని అర్ధమైపోతుంది.ఈ మూవీలో విజయ్ సేతుపతి సరసన రుక్మిణి వసంత్ నటిస్తుండగా..అవినాష్,దివ్య పిళ్లై,బబ్లూ,రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.ఇది విజయ్ సేతుపతికి 51వ మూవీ.