ఉండేటోళ్లు 800.. వచ్చేటోళ్లు 10 లక్షలు

ఉండేటోళ్లు 800.. వచ్చేటోళ్లు 10 లక్షలు

ఆస్ట్రియాలోని హాల్‌‌‌‌‌‌‌‌స్తాత్​ పట్టణం మస్తుంటది. అక్కడికి వచ్చిన వాళ్లకు బయటికెళ్లాలంటే మనసొప్పనంత ఆకట్టుకుంటది. అందుకే టూరిస్టులు గుట్టలు గుట్టలుగా వస్తుంటారు. ఎంతలా అంటే.. పట్టణంలో 800 మంది జనాభా ఉంటే అక్కడికొచ్చే టూరిస్టులు మాత్రం ఏడాదికి పది లక్షల పైనే. హాల్‌‌‌‌‌‌‌‌స్తాత్​కు చైనా వాళ్లు ఎక్కువగా వస్తుంటారు. పర్యాటకుల వల్లే ఆ టౌన్‌‌‌‌‌‌‌‌కు మస్తు డబ్బు వస్తోందని, తాము ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నామని, టౌన్‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన సౌకర్యాలు, వసతులను తామే ఏర్పాటు చేసుకునేతంగా ఎదిగామని హాల్‌‌‌‌‌‌‌‌స్తాత్​మేయర్‌‌‌‌‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

కానీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుండటంతో కొందరు నొచ్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్లు టౌన్‌‌‌‌‌‌‌‌ను చిత్తడి చిత్తడి చేసేస్తున్నారని వాపోతున్నారు. ఇక్కడ ఉండే వాళ్లకు ఇది ఇబ్బందిగా ఉంటోందని చెబుతున్నారు. దీంతో పట్టణానికి వచ్చే టూరిస్టు బస్సుల సంఖ్య తగ్గించాలని హాల్‌‌‌‌‌‌‌‌స్తాత్ భావిస్తోంది.