టార్గెట్ ​19.9 కోట్ల మొక్కలు..20 నుంచి హరితహారం

టార్గెట్ ​19.9 కోట్ల మొక్కలు..20 నుంచి హరితహారం

నిర్మల్‍, వెలుగు: హరితహారం మొక్కలు వంద శాతం బతకాలనే లక్ష్యంతో పని చేయాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి అధికారులకు సూచించారు. ఈ నెల 20 నుంచి హరితహారం 6వ విడత కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అటవీశాఖ కన్జర్వేటర్‍, డీఎఫ్ వో, ఎఫ్‍ఆర్వోలతో నిర్మల్‍జిల్లా కేంద్రం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా 19.9 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలంగాణను హరిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం కేసీఆర్‍230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా హరితహారం చేపట్టారని, గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 186 కోట్ల మొక్కలు నాటినట్లు తెలిపారు. 127 కోట్ల మొక్కలు అడవి బయట నాటినట్లు చెప్పారు. ఈ సంవత్సరం హరితహారంలో కోటి చింత మొక్కలు నాటాలని సూచించారు. క‌‌రోనా నేప‌‌థ్యంలో  హ‌‌రిత స్ఫూర్తిని చాటేలా తెలంగాణ‌‌కు హ‌‌రితహారం లోగోతో ఉన్న గ్రీన్ మాస్క్ ధ‌‌రించాల‌‌ని మంత్రి తెలిపారు. వంద శాతం ల‌‌క్ష్యాన్ని జియో ట్యాగింగ్ తో స‌‌హా సాధించాల‌‌ని ఆదేశించారు. హరితహారాన్ని ఆడిట్ ప‌‌రిధిలోకి తేవాల‌‌ని, థ‌‌ర్డ్ పార్టీ ద్వారా పచ్చదనం పెరి‌‌గిన శాతాన్ని, సర్వైవల్    శాతాన్ని కచ్చితంగా లెక్కించాలని స్పష్టం చేశారు.

కూతురే లేదు..కళ్యాణ లక్ష్మి వచ్చింది