Sunil Turbo: మెగాస్టార్కు విలన్గా సునీల్..ఆటో బిల్లా క్యారెక్ట‌ర్‌తో మలయాళ ఎంట్రీ..

Sunil Turbo: మెగాస్టార్కు విలన్గా సునీల్..ఆటో బిల్లా క్యారెక్ట‌ర్‌తో మలయాళ ఎంట్రీ..

మెగాస్టార్ మమ్ముట్టి 72ఏళ్ల వయస్సులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం టర్బో అనే మూవీలో నటిస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ థ్రిల్లర్ మూవీకి మిధున్ మాన్యువల్ థామస్ కథను అందించాడు. మమ్ముట్టి తన బ్యానర్‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ మే 23, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. 

అయితే తాజా సమాచారం ప్రకారం టర్బో మూవీలో టాలీవుడ్ క‌మెడియ‌న్ సునీల్ నటిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీతో  సునీల్ మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఇందులో మెగాస్టార్ మ‌మ్ముట్టికి సునీల్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఆటో బిల్లా క్యారెక్ట‌ర్‌లో సునీల్ విశ్వరూపం చూస్తారని మేకర్స్ పోస్ట్ చేశారు. అంతేకాదు మలయాళంలో సునీల్ కి మంచి పేరు తెచ్చిపెట్టే మూవీ అవుతుంద‌ని చెబుతోన్నారు. ప్రస్తుతం సునీల్ పుష్ప 2, గేమ్ ఛేంజర్ మూవీస్ లో నటిస్తున్నాడు. అలాగే ఈ మూవీలో క‌న్న‌డ డైరెక్టర్,యాక్టర్ రాజ్ బీ శెట్టి మెయిన్ విల‌న్‌గా కనిపిస్తున్నాడు. 

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్నఈ మూవీలో మ‌మ్ముట్టి ట‌ర్బో జోస్ అనే జీప్ డ్రైవ‌ర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.ఇందులో మమ్ముట్టి జీపుపై రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్న లుక్ తెగ వైరల్ అయింది.మమ్ముట్టి నుంచి చాలా రోజుల తర్వాత పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అవతారంలో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతోపాటు మమ్ముట్టి బజూక సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం బజూక పోస్ట్ ప్రొడక్షన్‌ దశలో ఉండగా..మరో మూవీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది