కామన్వెల్త్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా బోణీ

కామన్వెల్త్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా బోణీ

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌‌ టేబుల్‌‌ టెన్నిస్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా జట్లు బోణీ చేశాయి. సోమవారం జరిగిన మెన్స్‌‌ తొలి మ్యాచ్‌‌లో ఇండియా 3–0తో జింబాబ్వేపై గెలిచింది. తొలి మ్యాచ్‌‌లో మానవ్‌‌ ఠక్కర్‌‌ 11–3, 11–2, 11–6తో  తైండా ముంవుమాపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌‌లో హర్మీత్‌‌ దేశాయ్‌‌ 11–5, 11–4, 11–5తో తపివా ముసరుర్వాను ఓడించాడు.

మూడో మ్యాచ్‌‌లో యంగ్‌‌ ప్లేయర్‌‌ పయాస్‌‌ జైన్‌‌ 11–3, 11–3, 11–8తో విక్రమ్‌‌ సింగ్‌‌ను కట్టడి చేయడంతో ఇండియా ఈజీగా గెలిచింది. విమెన్స్‌‌ మ్యాచ్‌‌లో సుతీర్ఘ ముఖర్జీ 11–4, 11–2, 11–5తో ఫాతిమత్‌‌ ధీమా అలీపై, యశస్విని ఘోర్పడే 11–2, 11–5, 11–7తో ఐషత్‌‌ రఫా నాజిమ్‌‌పై, స్వస్తిక ఘోష్‌‌ 11–3, 11–5, 11–2తో మిష్కా మొహమ్మద్‌‌ ఇబ్రహీంపై గెలిచారు. ఈ మూడు మ్యాచ్‌‌ల్లో ఇండియా ప్లేయర్లు ఒక్క గేమ్‌‌ కూడా కోల్పోలేదు.