అట్టహాసంగా మొదలైన ఖేలో ఇండియా యూత్​ గేమ్స్

అట్టహాసంగా మొదలైన ఖేలో ఇండియా యూత్​ గేమ్స్

ఆకట్టుకున్న ఓపెనింగ్‌‌ సెర్మనీ..

గౌహతి:  ఖేలో ఇండియా యూత్​ గేమ్స్​ మూడో సీజన్​ శుక్రవారం ఘనంగా మొదలైంది. వన్‌‌ ఇండియా’ స్ఫూర్తి రగిలించేలా, అస్సాం సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా యూత్‌‌ గేమ్స్‌‌ ఓపెనింగ్ సెర్మనీని అట్టహాసంగా  నిర్వహించారు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌‌ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి సర్భానంద్‌‌ సోనోవాల్‌‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేశం నలుమూలల నుంచి 6,800 మంది అథ్లెట్స్‌‌ బరిలో ఉండగా, స్టార్‌‌ స్ప్రింటర్‌‌ హిమదాస్‌‌ టార్చ్​ బేరర్‌‌గా వ్యవహరించింది. ప్రముఖ సింగర్‌‌ శంకర్‌‌ మహదేవన్‌‌ తన పాటలతో స్టేడియంలోని అభిమానులను హోరెత్తించగా, రకరకాల ఈవెంట్లు ప్రేక్షకులను ముగ్దులను చేశాయి.

నిరాశపర్చిన తెలంగాణ కబడ్డీ టీమ్‌‌

మెగా టోర్నీలో తెలంగాణ కబడ్డీ టీమ్‌‌ నిరాశ పరిచింది. శుక్రవారం జరిగిన బాలుర అండర్‌‌–17 లీగ్‌‌ మ్యాచ్‌‌లో తెలంగాణ 25–32తో ఉత్తరప్రదేశ్‌‌ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇతర క్రీడాంశాల్లో…  అండర్‌‌–17 జిమ్నాస్టిక్స్‌‌లో బాలికల కేటగిరీలో ప్రియాంక దాస్‌‌ గుప్తా (త్రిపుర) 42.60 పాయింట్లతో ఈ సీజన్‌‌లో తొలి గోల్డ్‌‌ మెడల్‌‌ను సొంతం చేసుకుంది. దీంతో గతేడాది ప్రొతిష్ట సమంత (వెస్ట్‌‌ బెంగాల్‌‌) 42.05 పాయింట్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించింది. బాలుర విభాగంలో ఉత్తరప్రదేశ్‌‌ జిమ్నాస్ట్‌‌ జతిన్‌‌ కుమార్‌‌ కనోజియా పసిడితో మెరిశాడు. ఆన్‌‌లైన్‌‌లో జిమ్నాస్టిక్స్‌‌ పాఠాలు నేర్చుకున్న ఉపాషా తాలుక్‌‌దార్‌‌.. ఈ సీజన్‌‌లో అస్సాంకు తొలి మెడల్‌‌ అందించింది. రిథమిక్‌‌ జిమ్నాస్టిక్స్‌‌లో అస్మి అనుష్క్‌‌, శ్రేయ ప్రవీణ్‌‌ (మహారాష్ట్ర) వరుసగా తొలి రెండు స్థానాలు సాధించగా, ఉపాషాకు బ్రాంజ్‌‌ దక్కింది.

Khelo India Youth Games 2020: Assam's Cultural Diversity, India's Oneness On Display In Opening Ceremony