NTR: నందమూరి నాలుగోతరం హీరో వచ్చేసాడు.. డైరెక్టర్ ఎవరంటే?

NTR: నందమూరి నాలుగోతరం హీరో వచ్చేసాడు.. డైరెక్టర్ ఎవరంటే?

ఎన్టీఆర్ కుటుంబం నుంచి నాలుగో తరం నటవారసుడిగా జానకి రామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. బుధవారం అక్టోబర్ 30న జరిగిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో హీరో నందమూరి తారక రామారావు ఫస్ట్ లుక్‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను లాంచ్ చేశారు.

పొడవాటి జుట్టు, దృఢమైన శరీరాకృతితో కనిపించిన అతను, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్ ఈ కార్యక్రమానికి ముఖ్య​ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు.

ఈ కొత్త హీరోపై ఓ వీడియోను సైతం విడుదల చేశారు. ఎన్టీఆర్ ప్రమాణంతో ఈ వీడియో ఉంది. నందమూరి తారక రామారావు అనే నేను.. అంటూ తన ప్రమాణాన్ని నాలుగో తరం ఎన్టీఆర్ మొదలుపెట్టారు. వైవీఎస్ చౌదరి వద్ద 18 నెలలుగా శిక్షణ పొందినట్టు తెలిపారు. ఇందులో యాక్షన్ ప్యాక్డ్, స్టైలిష్‍గా ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది

‘1980 బ్యాక్‌‌డ్రాప్‌‌లో జరిగే కథ ఇది. తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యంలో ఉంటుంది. మెసేజ్‌‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌ చక్కగా కుదిరాయి’ అని మేకర్స్ వెల్లడించారు.