ఇంగ్లాండ్ తో జరుగుతోన్న అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 6 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి ఇండియా 34 పరుగులు చేసింది. ఓపెనర్ అరోన్ జార్జ్ 9పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో వైభవ్ సూర్యవంశీ 23 , ఆయుష్ మాత్రే ఉన్నారు.
ఈ మ్యాచ్ గెలిస్తే రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్‌ను సాధించిన జట్టుగా ఇండియా రికార్డ్ సృష్టించనుంది. ఈ మెగా పోరులో ఇంగ్లండ్‌తో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. 2022లో యష్ దూల్ సారథ్యంలో చివరిసారి ట్రోఫీ నెగ్గిన ఇండియా మళ్లీ దాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.
ALSO READ : భళా బెంగళూరు..రెండోసారి డబ్ల్యూపీఎల్ టైటిల్ సొంతం
ఇది జరగాలంటే వైభవ్ సూర్యవంశీ మరోసారి సంచలన బ్యాటింగ్‌ను చూపెట్టాల్సిందే. ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో 264 రన్స్ చేసిన వైభవ్ టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఫైనల్లో అతను చాలా కీలకం కానున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. టోర్నీ రికార్డు పరంగా చూసినా ఇండియాకు తిరుగులేదు. 16సార్లు టోర్నీ జరిగితే ఇండియా పదిసార్లు టైటిల్ ఫైట్‌కు అర్హత సాధించింది. 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించిన చరిత్ర కూడా మనకే అనుకూలంగా ఉంది. విహాన్ మల్హోత్రా, అభిగ్యాన్ కుండుతో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. దీపేశ్ దేవేంద్రన్, హెనిల్ పటేల్, ఆర్.ఎస్. అంబరీష్‌తో కూడి పేస్ దళం ఇప్పటివరకు అద్భుతాలు చేసింది. అయితే ఇంగ్లండ్ జట్టులో పేసర్లను బాగా ఎదుర్కొనే బ్యాటర్లు చాలామంది ఉండటంతో వీళ్లపై ఒత్తిడి నెలకొంది. దాంతో ఇండియా స్పిన్ ద్వయం కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్‌పై ఎక్కువగా ఆధారపడే చాన్స్ ఉంది.
మరోవైపు ఇంగ్లండ్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఫైనల్‌కు వచ్చారు. సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాపై గెలవడం కాన్ఫిడెన్స్ పెంచే అంశం. అత్యధిక వికెట్లు తీసిన పేసర్ మ్యానీ లుమ్స్‌డెన్ (15 వికెట్లు)కు సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో నుంచి సహకారం అందితే ఇండియాకు కష్టాలు తప్పవు. బ్యాటింగ్‌లో బెన్ మేయెస్ (399), కెప్టెన్ థామస్ రేవ్ (299) నుంచి ప్రమాదం పొంచి ఉంది. అయితే ఓపెనర్లు బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్ ఫామ్‌లో లేకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది.
ALSO READ : టార్గెట్ 204 పెట్టినా ఊదేశారు..
ఇంగ్లండ్ U19 (ప్లేయింగ్ XI): బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రెవ్( వికెట్ కీపర్ ), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్
ఇండియా U19 (ప్లేయింగ్ XI): ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మ్హత్రే( కెప్టెన్ ), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్ ), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్
