ఉమెన్స్ ప్రీమియర్ 2026 లో ఊహించని ఫలితం ఎదురైంది. 204 పరుగుల భారీ టార్గెట్ ను బెంగళూర్ ఛేజ్ చేస్తుందా..? ఈ సారి ఢిల్లీదే కప్ అనుకున్నారు అందరూ. కానీ.. స్టార్టింగ్ నుంచి ఆర్సీబీ బ్యాటర్లు దుమ్ము దులిపేశారు. ఏ ఒక్క బౌలర్ ను కూడా వదలకుండా పరుగుల వరద పారించారు. ఢిల్లీపై థ్రిల్లింగ్ విక్టరీతో WPL రెండో టైటిల్ ను గెలిచారు. 4 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో టార్గెట్ ను రీచ్ అయ్యారు. దీంతో రెండు సార్లు కప్ గెలిచిన ముంబైని సమం చేశారు.
ఓపెనర్ జార్జియా వాల్ , కెప్టెన్ స్మృతి మంధాన అద్భుతమైన పాట్నర్ షిప్ తో ఢిల్లీ టైటిల్ ఆశాలను సమాధి చేశారు. ఓపెనర్ జార్జియా వాల్ 79 రన్స్ (54 బాల్స్, 14 ఫోర్లు), కెప్టెన్ స్మృతి మంధాన 87 రన్స్ (41 బాల్స్, 12 ఫోర్లు, 3 సిక్సులు) నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడి బౌండరీలు సాధించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్ తో మంధాన ఈ సీజన్ లో అత్యధిక రన్ స్కోరర్ గా నిలిచింది.
204 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన RCB ఊచకోత అంటే ఏంటో చూపించారు. ఢిల్లీ బౌలర్లను ఆడేసుకున్నారు. ఓపెనర్ గ్రేస్ హారిస్ 9 రన్స్ మాత్రమే చేసి చినెల్లీ హెన్రీ బౌలింగ్ లో ఔటవ్వటంతో.. మొదట్లోనే వికెట్ కోల్పోయిన బెంగళూర్ బ్యాటర్లు.. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్కోర్ ను అలా ఈజీగా ఊదేశారు. 79 రన్స్ చేసి వాల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్ (6).. నందిని శర్మ బౌలింగ్ లో మిన్ను మణికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత స్మృతి మంధాన కూడా చినెల్లీ హెన్రీ బౌల్డ్ చేయడంతో 87 రన్స్ దగ్గర ఔటవ్వడంతో ఆర్సీబీ గెలుపుపై కొంత సేపు సస్పెన్స్ కొనసాగింది. చివర్లో డీక్లెర్క్ 7 (5), రాధా యాదవ్ (12 రన్స్, 5 బాల్స్ , 2 ఫోర్లు) ఇన్నింగ్స్ ను పూర్తి చేశారు. రాధా యాదవ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టి టార్గెట్ పూర్తి చేసింది.
తేలిపోయిన ఢిల్లీ బౌలర్లు:
ఢిల్లీ బ్యాటర్లు భారీ టార్గెట్ ఇచ్చినప్పటికీ దాన్ని కాపాడటంలో బౌలర్లు తేలిపోయారనే చెప్పాలి. ఆర్సీబీ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయటంలో విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో చినెల్లీ హెన్రీ రెండు వికెట్లు, మిన్ను మణి, నందిని శర్మ చెరో వికెట్ పడగొట్టారు. ఓపెనర్ గ్రేస్ హారిస్ 9 రన్స్ కే మొదట్లోనే పెవిలియన్ కు పంపింది చినెల్లీ హెన్రీ.. ఆ తర్వాత స్మృతి మంధానను కూడా బౌల్డ్ చేసి పెవిలియన్ కు పంపింది.. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించిన మరో ఓపెనర్ జార్జియా వాల్ ను 79 రన్స్ తన వ్యక్తి గత స్కోర్ దగ్గర పెవిలియన్ కు పంపింది మిన్ను మణి. 17వ ఓవర్లో షెఫాలీ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది.
ఢిల్లీ దంచేసినప్పటికీ..
మూడు సార్లు ఫైనల్ కు చేరుకుని కప్ మిస్ చేసుకున్న ఢిల్లీ.. నాలుగో సారి టైటిల్ గెలవాలనే కసితో చితక్కొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఊచకోత కోసినట్లుగా బ్యాట్ ను ఝుళిపిస్తూ RCB బౌలర్లకు చుక్కులు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి బెంగళూర్ ముందు 204 రన్స్ భారీ టార్గెట్ ఉంచారు.
ఓపెనర్లు షఫాలీ వర్మ, లిజెల్లీ లీ డ్యాషింగ్ ఓపెనింగ్ ను ఇవ్వడంతో అదే ఊపును మిగతా బ్యాటర్లు కొనసాగించారు. షఫాలీ వ ర్మ13 బాల్స్ లో 20 రన్స్ (3 ఫోర్లు) చేసింది. అరుంధతి రెడ్డి బౌలింగ్ లో49 రన్స్ దగ్గర కీపర్ రిచా ఘోష్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.
మరో డ్యాషింగ్ ఓపెనర్ లిజెల్లీ లీ 8వ ఓవర్లో 37 రన్స్ (30 బాల్స్ లో) చేసింది. నదినే డి క్లర్క్ బౌలింగ్ లో గ్రేస్ హారిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఓపెనింగ్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చిన లీ.. 3 ఫోర్లు, 3 సిక్సులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ జెమీమా రోట్రిగ్జ్.. కెప్టెన్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కేవలం 32 బాల్స్ లో 7 ఫోర్లతో రన్స్ పూర్తి చేసుకుంది. 15 వ ఓవర్ 5వ బాల్ లో నదినే డి క్లర్క్ వేసిన బాల్ లో సింగిల్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత 16 ఓవర్లో సయాలీ సట్ఘరే బౌలింగ్ లో 57 (37 బాల్స్) నదినే డీ క్లర్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది.
ఆ తర్వాత లారా వోల్వార్ట్, చినెల్లీ హెన్రీ మంచి పాట్నర్షిప్ కొనసాగిస్తూ.. స్కోర్ బోర్డును 200 పరుగులను దాటించారు. లారా 25 బాల్స్ లో 44 రన్స్ చేసి.. లాస్ట్ బాల్ కు రన్ ఔట్ అయ్యింది. మరో బ్యాటర్ హెన్రీ 15 బాల్స్ లోనే 35 రన్స్ చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 4 వికెట్లు కోల్పోయి 203 చేసిన ఢిల్లీ ఉమెన్స్ ఫైనల్ లో హైయెస్ట్ స్కోర్ చేసింది.
ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూర్ .. ఢిల్లీని తక్కువ స్కోర్ కు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. లారెన్ బెల్ తప్ప అందరూ పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లలో బెంగళూర్ బౌలర్లలో అరుంధతీ రెడ్డీ, డీ క్లర్క్, సయాలీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
