టీ20 వరల్డ్‌ కప్‌కు ఒక్కరోజు ముందు.. టీమిండియాలో కీలక మార్పు.. హర్షిత్ రాణా ఔట్

టీ20 వరల్డ్‌ కప్‌కు ఒక్కరోజు ముందు.. టీమిండియాలో కీలక మార్పు.. హర్షిత్ రాణా ఔట్

ముంబై: టీ20 వరల్డ్‌కప్‌నకు ఒక్కరోజు ముందు టీమిండియాలో కీలక మార్పు జరిగింది. మోకాలి గాయం కారణంగా హర్షిత్ రాణా ఇబ్బంది పడుతుండటంతో ఈ టీ20 వరల్డ్ కప్నకు ఈ పేసర్ దూరమయ్యాడు. అతని స్థానంలో టీమిండియా స్టార్ పేసర్, మన హైదరాబాదీ సిరాజ్ స్క్వాడ్లోకి వచ్చాడు. షమీని జట్టులోకి తీసుకుంటారని ప్రచారం జరిగినప్పటికీ సిరాజ్కు అవకాశం దక్కింది.

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. మిడిలార్డర్, ఫినిషింగ్ బాధ్యతలను రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే పంచుకోనున్నారు. పేస్ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ హార్దిక్ పాండ్యా  టీమ్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌లో  కీలకం కానుండగా, స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల సత్తా ఉన్న శివమ్ దూబే అదనపు బలంగా మారాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ ఆల్ రౌండర్లు జట్టుకు మరింత బలాన్ని ఇస్తున్నారు.  

►ALSO READ | ఓడిన ఇంగ్లండ్.. ఫాల్కనర్ సెంచరీ వృథా.. U19WorldCup ఛాంపియన్ టీమిండియా

ఇక, బౌలింగ్ దళానికి జస్‌‌‌‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనుండగా, అర్ష్‌‌‌‌దీప్ సింగ్ అతనికి తోడుగా ఉంటాడు. సిరాజ్ కూడా ఇప్పుడు ఈ పేస్ బౌలర్లతో కలిశాడు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి  తమ మణికట్టు మాయాజాలంతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో తొలి రోజు ఇండియా .. అమెరికా జట్టుతో జరిగే మ్యాచ్‌‌‌‌లో ట్రోఫీ వేటను ప్రారంభిస్తుంది.