అండర్–19 వరల్డ్ కప్లో ఇంగ్లండ్పై టీమిండియా ఘన విజయం సాధించింది. 100 పరుగుల అత్యధిక తేడాతో గెలిచి ఛాంపియన్గా నిలిచింది. ఇంగ్లండ్ జట్టు ఆశలకు ఫాల్కనర్ ఊపిరి పోసే ప్రయత్నం చేసినప్పటికీ అది వృథా ప్రయాసగానే మిగిలిపోయింది. 67 బంతుల్లో ఏడు సిక్సులు, తొమ్మిది ఫోర్లతో ఫాల్కనర్ 115 పరుగులు చేసి సెంచరీతో రాణించినా ఇంగ్లండ్ జట్టుకు పరాజయం తప్పలేదు. టీమిండియా పెట్టిన 412 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. రెండూ 175 పరుగులు చేసి అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీకే దక్కాయి. అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్లో బిగ్గెస్ట్ విన్ చేసి టీమిండియా కుర్రాళ్లు తిరుగులేదనిపించారు. ఈ విజయంతో U19WorldCup టైటిల్స్ అత్యధికంగా సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. టీమిండియా ఈ విజయంతో కలిపి మొత్తం 6 టైటిల్స్ సాధించింది. టీమిండియా తర్వాత 4 టైటిల్స్తో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 2 టైటిల్స్తో పాకిస్తాన్ మూడో స్థానంలో నిలిచాయి.
