దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డుపై గుంతలో పడి బ్యాంకు మేనేజర్ మృతిచెందిన ఘటనలో కీలక అప్డేట్..ఈఘటనకు బాధ్యులుగా ముగ్గురు ఇంజనీర్లను సస్పెండ్ చేశారు అధికారులు. ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో నీటిపైపులైన్ కోసం తవ్వి వదిలేసిన గుంతలోపడి మోటరిస్ట్ (బ్యాంకుమేనేజర్)చనిపోయిన క్రమంలో ఢిల్లీ జల్ బోర్డు కు చెందిన ముగ్గురు ఇంజనీర్లను ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 6) సస్పెండ్ చేసింది.
గురువారం ఉదయం ఢిల్లీలోని రోహిణి ఏరియాకు చెందిన HDFC బ్యాంకుమేనేజర్ గా పనిచేస్తున్న కమల్అనే జనక్ పురి ప్రాంతంలో నడిరోడ్డుపై తవ్వి వదిలేసిన గుంతలో పడి చనిపోయాడు. విధులు ముగించుకొని రాత్రి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తీవ్రగాయాలతో రాత్రంతా గుంతలో పడివున్న బ్యాంకు మేనేజర్ ఫిబ్రవరి 6న ఉదయం శవమై కనిపించాడు. రాత్రంతా కమల్ కోసం వెదికిన కుటుంబ సభ్యులు చివరికి బైక్ తో సహా గుంతలో పడి చనిపోయినట్లు గుర్తించారు.
బ్యాంకుమేనేజర్ మృతికి ఢిల్లీ వాటర్ బోర్డు కారణమని నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.మరోవైపు ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ నేతలు కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందంటూ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బ్యాంకు మేనేజర్ కమల్ మృతితో విమర్శలు రావడంతో అప్రమత్తమైన ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. నిర్లక్ష్యంగా ప్రమాదానికి కారణమై ఓ నిండు ప్రాణం పోయిందని ముగ్గురు ఢిల్లీ వాటర్ బోర్డు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
