తెలుగు సినీ పరిశ్రమలో మెగా, నందమూరి కుంటుంబాల మధ్య ఉండే అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. వెండితెరపై పోటీ ఉన్నా.. బయట మాత్రం వారు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. క్లిన్ కారా తర్వాత మెగా ఇంట వారుసుడు రాకతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సంబరాలు జరుపుకుంటున్నారు.
చిరంజీవి కల నెరవేరిన వేళ..
మెగాస్టార్ చిరంజీవికి తన వారసుడి వారసుడిని చూడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. గతంలో క్లిన్ కారా పుట్టినప్పుడు మెగా ప్రిన్సెస్ వచ్చేసింది అని మురిసిపోయిన చిరు, ఇప్పుడు మనవడు కూడా తోడవడంతో తన కోరిక నెరవేరిందని ఉప్పొంగిపోతున్నారట. మెగా ఫ్యామిలీలో ఎక్కువగా అమ్మాయిలే ఉండటంతో, ఇప్పుడు అబ్బాయి రాకను 'మెగా వారసుడి' ఎంట్రీగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
బాలయ్య స్పెషల్ సర్ ప్రైజ్!
ఈ సంతోషకరమైన సమయంలో నందమూరి బాలకృష్ణ తన పెద్దరికాన్ని చాటుకున్నారు. సాధారణంగా బాలయ్య మనస్తత్వం చాలా భిన్నం. బయటకు గంభీరంగా కనిపించినా, మనసు వెన్న అని సన్నిహితులు చెబుతుంటారు. చరణ్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధంతో బాలయ్య ఒక అదిరిపోయే గిఫ్ట్ పంపినట్లు సమాచారం. తిరుమల శ్రీవారిపై అపారమైన భక్తి ఉన్న బాలయ్య, చరణ్ దంపతులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఒక దివ్యమైన పటాన్ని పంపారట. పవిత్రమైన ప్రసాదంతో పాటు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున పూలగుచ్చాలను పంపారు. కవల పిల్లల కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు ఆభరణాలు , వెండి బొమ్మలను బాలయ్య కానుకగా ఇచ్చారని ఫిల్మ్ నగర్ టాక్ వినిపిస్తోంది..
స్నేహమే మిన్న!
చిరంజీవి, బాలకృష్ణల మధ్య బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ గట్టి పోటీ ఉంటుంది. కానీ బయట ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎంతో సరదాగా ఉంటారు. అంతేకాదు రామ్ చరణ్ విషయంలో బాలయ్యకు ప్రత్యేకమైన అప్యాయత ఉంది. అనేక ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ కనిపించిన సంఘటనలు అనేకం. వెండితెరపై పోటీ ఉన్నా.. బయట మాత్రం కలిసి మెలిసి ఉంటారు. ఈ పరిణామం ఇరువర్గాల అభిమానులను ఆనందంలో నింపుతోంది.
