Under 19 World Cup : సూర్య వంశీ బ్యాటింగ్ విధ్వంసం.. 55 బంతుల్లో సెంచరీ

Under 19 World Cup : సూర్య వంశీ బ్యాటింగ్ విధ్వంసం.. 55 బంతుల్లో సెంచరీ

అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ దుమ్ముదుమారం. యంగ్ ప్లేయర్.. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ విధ్వంసానికి స్టేడియం అల్లాడిపోయింది. జస్ట్ 55 బంతుల్లో.. 100 పరుగులు చేశాడు ఈ చిచ్చరపిడుగు. హరారే వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో సూర్య వైభవ్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. 

ALSO READ : అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ పోరు.. 

55 బంతులు ఎదుర్కొన్న సూర్య వైభవ్.. 10 ఫోర్లు, 11 సిక్సులతో విధ్వంసం చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొట్టాడు. సెంచరీ తర్వాత కూడా వైభవ్ విశ్వరూపం ఆగలేదు. 66 బంతులు ఆడి.. 141 పరుగులు సాధించి ఇంగ్లాండ్ బౌలర్లపై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. చివరి వరకు ఇదే ఊపు కొనసాగిస్తే.. టీం ఇండియా ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

యంగ్ సెన్షేషన్ వైభవ్ సూర్యవంశీ క్రీస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి బ్యాట్ తో విజృంభించాడనే చెప్పాలి. 55 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సులతో 100 పరుగులు సాధించాడు సూర్యవంశీ. సూర్యవంశిని ఇంగ్లాండ్ బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. వరల్డ్ కప్ లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలతో 264 రన్స్ చేసి టాప్ ఫామ్  లో ఉన్న సూర్యవంశీ ఈ మ్యాచ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. టోర్నీ రికార్డు పరంగా చూసినా ఇండియాకు తిరుగులేదు. 16సార్లు టోర్నీ జరిగితే ఇండియా పదిసార్లు టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించింది. 

2022 ఫైనల్లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించిన చరిత్ర కూడా మనకే అనుకూలంగా ఉంది. విహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్హోత్రా, అభిగ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుండుతో మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటిష్టంగా కనిపిస్తోంది. దీపేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవేంద్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అంబరీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడి పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దళం ఇప్పటివరకు అద్భుతాలు చేసింది. అయితే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టులో పేసర్లను బాగా ఎదుర్కొనే బ్యాటర్లు చాలామంది ఉండటంతో వీళ్లపై ఒత్తిడి నెలకొంది. దాంతో ఇండియా స్పిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వయం కనిష్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఖిలాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది.