హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో బైకును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహేష్ అనే బ్లింకిట్ డెలివరీ బాయ్ మృతి చెందాడు. శుక్రవారం ( ఫిబ్రవరి 6 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..మహాబాబుబాబాద్ కి చెందిన 22 ఏళ్ళ మహేష్ ఉప్పల్ లో ఉంటూ బ్లింకిట్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. రోజులాగే ఇవాళ కూడా ఉప్పల్ లో డెలివరీలు చేస్తున్న మహేష్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఉప్పల్ లోని బ్లింక్ ఇట్ ఆన్లైన్ ఆఫీసు ముందు.. బంధువులు ఆందోళన చేపట్టారు. బ్లింకిట్ గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుందని చెబుతున్నారు సిబ్బంది. బ్లింకిట్ ఆఫీసు ముందు ఆందోళన చేస్తున్న మృతుడి బంధువులను చెదరగొట్టారు పోలీసులు.
►ALSO READ | గడ్చిరోలిలో భీకర ఎన్ కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం.. కీలక నేత ప్రభాకర్ మృతి
మహేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని.. తమకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చట్టాలు చేయాలని కోరుతున్నారు డెలివరీ బాయ్స్.
