వామ్మో.. గాల్లో ప్రాణాలు.. 80 శాతం ఎయిర్ ఇండియా విమానాల్లో.. ఇదీ పరిస్థితి !

వామ్మో.. గాల్లో ప్రాణాలు.. 80 శాతం ఎయిర్ ఇండియా విమానాల్లో.. ఇదీ పరిస్థితి !

ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంపై లోక్ సభ సాక్షిగా ఒక పచ్చి నిజం బయటపడింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో దాదాపు 80 శాతం విమానాల్లో సాంకేతిక సమస్యలు పునరావృతమవుతున్నాయని గవర్నమెంట్ గురువారం రోజు లోక్ సభలో డేటా బయటపెట్టింది. విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ లోక్ సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ డేటా ప్రకారం.. జనవరి 2025 నుంచి 754 విమానాలను అనలైజ్ చేయగా.. 377 విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. 

ఎయిర్ ఇండియాకు చెందిన 166 విమానాలను చెక్ చేయగా.. 137 విమానాల్లో పదేపదే సాంకేతిక సమస్యలు వెలుగుచూస్తున్నట్లు తేలిందని ఆయన వివరించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన 101 విమానాలను చెక్ చేయగా.. 54 విమానాల్లో.. 405 ఇండిగో విమానాలను చెక్ చేయగా.. 148 విమానాల్లో పదేపదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. 16 స్పైస్ జెట్ విమానాలు, ఎనిమిది అలియన్స్ ఎయిర్ విమానాలు కూడా తరచుగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. 

►ALSO READ | రోడ్డుపై గుంతలోపడి బ్యాంకు మేనేజర్ మృతి ఘటన.. ముగ్గురు ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు

DGCA పర్యవేక్షణ, తనిఖీలపై కూడా విమానయాన శాఖ సహాయ మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. 2025లో DGCA 56 ఆడిట్లు, 3 వేల 890 ప్లాన్డ్ సర్వీలియన్స్ ఇన్స్పెక్షన్స్, 84 సర్వీలియన్స్ ఆఫ్​ ఫారెన్ ఎయిర్ క్రాఫ్ట్ చెక్స్, 492 ర్యాంప్ చెక్స్ నిర్వహించిందని ఆయన వివరించారు. అంతేకాదు.. అన్ ప్లాన్డ్ సర్వీలియన్స్ యాక్టివిటీస్లో భాగంగా.. 874 స్పాట్ చెక్స్, 550 నైట్ సర్వీలియన్స్ ఆపరేషన్స్ కూడా DGCA చేసిందని ఆయన వివరించారు.