బ్యాటింగ్ తో బాల్ ను చితక్కొట్టటం ఏంటో ఎలా ఉంటుందో తెలుసా.. ఒక్క బాల్ కు రెండు పరుగుల చొప్పున బాదుడే బాదుడు అంటే ఎలా ఉంటుందో తెలుసా.. బౌలర్లకు పట్టపగలు చుక్కలు చూపించటం అంటే ఎలా ఉంటుందో తెలుసా.. ఇవన్నీ తెలియాలి అంటే.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ బ్యాటింగ్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.
వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ విధ్వంసానికి క్రికెట్ స్టేడియం హోరెత్తింది. 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ విధ్వంసానికి ఇంగ్లాండ్ జట్టు వణికిపోయింది.
ALSO READ : సూర్య వంశీ బ్యాటింగ్ విధ్వంసం.. 55 బంతుల్లో సెంచరీ
80 బాల్స్ ఆడి 175 పరుగులు చేశాడు
15 ఫోర్లు.. 15 సిక్సులు
ప్రతి బంతిని వెంటాడి.. వేటాడి మరీ కొట్టాడు.
ఒక్కో బాల్ కు 2 పరుగులుపైనే రాబట్టాడు
ఈ వరల్డ్ కప్ లో అత్యంత చిన్న వయస్సు.. 14 ఏళ్లకే 55 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు వైభవ్.అండర్ 19 వరల్డ్ కప్ మ్యాచుల్లో గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు విల్ మలాజ్.. జపాన్ జట్టుపై 51 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడు మన వైభవ్ సూర్య వంశీ 55 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఫాస్ట్ బౌలింగ్.. స్పిన్, మీడియం అని తేడా లేకుండా ప్రతి బంతిని బాదేశాడు. ప్రస్తుతం 28.4 ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి 274 రన్స్ చేసింది టీం ఇండియా. ఈ క్రమంలో ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
