U19WorldCup: 412 టార్గెట్ ఛేజ్ చేయడం ఇంగ్లండ్కు కష్టమే.. నో డౌట్.. ఇదే రీజన్ !

U19WorldCup: 412 టార్గెట్ ఛేజ్ చేయడం ఇంగ్లండ్కు కష్టమే.. నో డౌట్.. ఇదే రీజన్ !

హరారే: అండర్–19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా చిచ్చరపిడుగులు సృష్టించిన విధ్వంసానికి అండర్–19 ఇంగ్లండ్ టీం బెంబేలెత్తిపోయింది. కళ్ల ముందు 412 పరుగుల టార్గెట్ కనిపిస్తుండేసరికి ఇంగ్లండ్ మద్దతుదారుల్లో కూడా ఆ జట్టు గెలుపుపై నమ్మకం సన్నగిల్లింది.

డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ వైభవ్ సూర్య వంశీ 175 పరుగులతో ఇండియా భారీ టార్గెట్లో కీలక పాత్ర పోషించాడు. 74, 49, 81, 63, 77, 66.. ఇవీ ఇంగ్లండ్ బౌలర్లు సమర్పించుకున్న పరుగులు.

ఓపెనర్లు బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాకిన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జోసెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేకపోవడం ఇంగ్లండ్‌‌కు బిగ్గెస్ట్ మైనస్. 412 పరుగుల భారీ టార్గెట్ ఛేజ్ చేయాలంటే.. ఓపెనర్లు పరుగుల వరద పారించాలి. బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థామస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఈ ఇద్దరినీ మాత్రమే నమ్ముకుని 411 పరుగులు టార్గెట్ కొట్టడం అయ్యే పని కాదు.