గుండెపోటు వచ్చినప్పుడు.. మంచినీళ్లు ఇవ్వడం సురక్షితమేనా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

గుండెపోటు వచ్చినప్పుడు.. మంచినీళ్లు ఇవ్వడం సురక్షితమేనా?.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

గుండెపోటు..దేశంలో సంభవిస్తున్న మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరికి వస్తుంది. గుండెపోటు వచ్చినప్పుడు పేషెంట్లు నొప్పితో అల్లాడిపోతుంటారు. అలాంటి సమయాల్లో పేషెంట్లు దగ్గరున్నవారు ఆందోళనకు గురవుతారు. వారిని ప్రమాదం నుంచి తప్పించేందుకు కొందరు పేషెంటుకు మంచినీరు తాగిస్తుంటారు. అయితే  మంచినీరు తాగించడం సురక్షితమేనా..? డాక్టర్లు ఏమంటున్నారో చూద్దాం.  

దేశంలో మరణాలకు ప్రధాన కారణాలలో గుండె జబ్బులు కూడా ఒకటి. గుండె జబ్బు మరణాలలో 80 శాతం కంటే ఎక్కువ గుండెపోటు, స్ట్రోక్‌ వల్లే సంభవిస్తున్నాయి. ప్రతి నాలుగు మరణాలలో ఒకటి గుండె సంబంధిత వ్యాధులవల్లే సంభవిస్తోందని 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్' అధ్యయనం చెబుతోంది.

గుండెపోటు వస్తే శరీరంలో ఏం జరుగుతుంది?

గుండెపోటు సమయంల గుండె కండరానికి రక్త సరఫరా అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీంతో తీవ్రమైన ఛాతి నొప్పి, ఆందోళన, శ్వాస ఆడకపోవడం, చెమటలు పట్టడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని కొన్ని సార్లు పేషెంటు స్పృహ కూడా కోల్పోవచ్చు. 

గుండెపోటు సమయంలో నీళ్లు ఇవ్వడం మంచిదేనా?

గుండెపోటు సమయంలో పేషెంటు కు బలవంతంగా నీటిని ఇవ్వకూడదని అంటున్నారు డాక్టర్లు. గుండెపోటు సమయంలో రోగికి నీళ్లు తాగిస్తే వాంతులు కావచ్చు.. ఇది శ్వాస కోశ ఇబ్బందులకు దారి తీయొచ్చు..  రోగి పరిస్థితి దిగజారితే  లేదా అపస్మారక స్థితిలోకి వెళితే నీరు గొంతులో చిక్కుకొని అవకాశం ఉంది.. కొన్ని సార్లు రోగులకు ఎమర్జెన్సీ మెడిసిన్, లేదా యాంజియోగ్రఫి అవసరం ఉంటుంది.. ఆ సయమంలో ఖాళీ కడుపు  ఉండాలి.. అందకే గుండెపోటు వచ్చిన పేషెంటుకు మంచినీళ్లు ఇవ్వకపోవడం మంచిదంటున్నారు ప్రముఖ కార్డియాలజిస్టు, లూథియానకు చెందిన సిబియా మెడికల్​ సెంటర్​ డైరెక్టర్​  డాక్టర్​ ఎస్ ఎస్​ సిబియా సూచించారు. 

►ALSO READ | ఆధ్యాత్మికం:  వ్యాపారంలో నష్టాలా..శనివారం ఇలా చేయండి.! 

ఎప్పుడు నీరు తాగించొచ్చు?

పేషెంట్​ పూర్తిగా స్పృహలో ఉండి, మాట్లాడుతున్నప్పుడు డాక్టర్​సలహాతో  నీరు తాగించొచ్చంటున్నారు డాక్టర్లు.అత్యవసర పరిస్థితుల్లో నీటిని తాగించడం వద్దని అంటున్నారు. 

గుండెపోటు వస్తే ఏంచేయాలి?

  • రోగిని ప్రశాంతంగా కూర్చోబెట్టాలి 
  • వీలైనంత తొందరగా ఆస్పత్రికి లేదా  డాక్టర్​ దగ్గరకు తీసుకెళ్లాలి 
  • డాక్టర్ల సలహా మేరకు ఆస్పిరిన్​ ఇవ్వాలి. 
  • బిగుతుగా ఉండే దుస్తులు వదులు చేయాలి 

గుండెపోటు సమయంలో ఏం చేయకూడదు ?

  • నీరు, జ్యూస్​ లాంటివి తాగించొద్దు
  • నొప్పిని గ్యాస్​ అసిడిటీ అని కొట్టిపారేయకుండా డాక్టర్లను సంప్రదించాలి 
  • ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి చేర్చడం ద్వారా సరైన సమయంలో చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చు.