ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తదేనా?..బొగ్గు కుంభకోణం, కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ నాయకులపై చర్యలేవి?: ఎంపీ లక్ష్మణ్ 

ఫోన్ ట్యాపింగ్ కేసు ఉత్తదేనా?..బొగ్గు కుంభకోణం, కాళేశ్వరం అవినీతిలో బీఆర్ఎస్ నాయకులపై చర్యలేవి?: ఎంపీ లక్ష్మణ్ 

ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సింగరేణి బొగ్గు కుంభకోణం, కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో ఆ పార్టీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ డిమాండ్​ చేశారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసు ఉత్తదేనా అని ప్రశ్నించారు. శనివారం ముషీరాబాద్ అడిక్​మెట్ ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ సీనియర్ నాయకుడు సాయికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్స్​అందజేశారు.  

కాంగ్రెస్, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు తమ పార్టీని గెలిపించాలని కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, నాయకులు రమేశ్​రామ్, కౌండిన్య ప్రసాద్, వెంకటేశ్, శేషసాయి తదితరులు పాల్గొన్నారు.