పురాణాల ప్రకారం ఒక్కో దేవుడికి ఒక్కో రకంగా పూజ చేస్తే ఆ భగవంతునిఆశీస్సులు పుష్కలంగాఉంటాయని పండితులు చెబుతున్నారు. విష్ణుమూర్తిని..తులసి దళాలతో.. శివుడికి అభిషేకం.. అలానే ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజ చేస్తారు. అంజన్న భక్తులు హనుమంతునికి శనివారం తమలపాకుల దండను సమర్పిస్తారు. వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శనివారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలని పండితులు చెబుతన్నారు. ఆధ్యాత్మిక వేత్తలు తెలిసిన వివరా ప్రకారం హనుమంతుడికి ఆకు పూజ చేస్తే ఎలాంటి ఉపయోగాలున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉందని పురాణాల ద్వారా తెలుస్తుంది. త్రేతా యుగంలో సీతమ్మతల్లి .. చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని స్వామీ ఏమిటది.. మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడట.. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడని పెద్దలు చెబుతుంటారు..
- ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
- ఆంజనేయ స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారని పండితులు చెబుతుంటారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. ..తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన శాంతి, సుఖము లభిస్తాయని హనుమత్ వ్రతంలో చెప్పబడింది.
- తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.
- ఆంజనేయస్వామికి లేత తమల పాకుల హారాన్ని దండగా తయారు చేసి సమర్పిస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి ఉపశమనం కలుగుతుంది
- ఆంజనేయస్వామికి తమలపాకుల హారంతో అలంకరిస్తే జాతక దోషాలు తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
- భార్య భర్తల మధ్య మనస్పర్దలు వచ్చినట్లయితే ఆంజనేయస్వామిని దర్శించి ఆకు పూజ చేయాలని పండితులు చెబుతుంటారు.
- వ్యాపారస్తులకు నష్టాలు వస్తుంటే హనుమంతుడిని తమలపాకులతో పూజించి .. దక్షిణ.. తాంబూలం ..దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది.
- జాతకంలో శని గ్రహం వలన ఇబ్బందులు పడుతున్న వారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.
- వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.
- సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిద్దిస్తుంది.
- హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.
- కోర్టు వివాదాల సమయంలో హనుమంతుడిని తమలపాకులతో పూజించి .. సుందరాకాండ పారాయణం చేస్తే జయం మీది అవుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
