సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన సేవ : సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ కృష్ణ టంకా

సమాజానికి తిరిగి ఇవ్వడమే నిజమైన సేవ : సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ కృష్ణ టంకా
  • మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు అడ్వకేట్ వివేక్ కృష్ణ టంకా
  •     అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న కాకా.. గొప్ప విద్యాసంస్థను నిర్మించారు
  •     అంబేద్కర్ లా కాలేజీ విద్యార్థుల పార్లమెంట్, సుప్రీంకోర్టు సందర్శనకు సహకరిస్త
  •     ఏఐ వచ్చాక ఉద్యోగ రంగాల్లో మార్పులు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ముషీరాబాద్, వెలుగు: సమాజానికి తిరిగి ఇవ్వడ మే నిజమైన సేవ అని.. న్యాయవాద వృత్తి ఆ సేవ ను మరింత ఎక్కువ చేసేందుకు దోహదం చేస్తుంద ని మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ కృష్ణ టంకా అన్నారు. శనివారం బాగ్‌‌లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో లీడర్షిప్ సింపోజియం పేరిట ‘ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ ఆన్ అడ్వకేట్ 21 సెంచరీ’ అంశంపై సదస్సు జరి గింది. దీనికి వివేక్ కృష్ణ టంకా, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ జి.వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్, కరస్పాండెంట్ జి.సరోజా వివేక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా వివేక్ కృష్ణ టంకా మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకున్న కాకా వెంకటస్వామి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువునందించేందుకు గొప్ప విద్యాసంస్థను ఏర్పాటు చేశారని ప్రశంసించారు. అంబేద్కర్ లా కాలేజీ స్టూడెంట్లను భావిభారత నాయకులుగా  తీర్చిదిద్దడం సంతోషంగా ఉందన్నారు. అయితే  ఫెయిల్యూర్లకు కుంగిపోకుండా వాటి నుంచి పాఠా లు నేర్చుకొని జీవిత లక్ష్యాన్ని సాధించుకోవాలని స్టూడెంట్లకు సూచించారు. మీరు సక్సెస్​ఫుల్​లాయర్​ అయితే దేశ ప్రధానులు, రాష్ట్రాల సీఎంలు కూడీ మీతో తరచూ మాట్లాడతారని చెప్పారు. మంచి లాయర్‌‌‌‌గా కొనసాగాలంటే నిబద్ధతతో కష్టపడాలన్నారు. అంబేద్కర్ కాలేజీ స్టూడెంట్లకు పార్లమెంట్, సుప్రీంకోర్టు సందర్శనలో తన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

అడ్వకేట్లకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు

 ఏఐ వచ్చాక అన్ని ఉద్యోగ రంగాల్లో మార్పులు వస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వైట్ కాలర్ జాబ్స్ డిమాండ్​తగ్గి.. బ్లూ కాలర్ జాబ్స్‌‌కు డిమాండ్ పెరుగుతుందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపడుతున్నదని వివరిం చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గొప్ప అడ్వకేట్లుగా రాణించాలంటే కష్టపడితేనే సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అడ్వకేట్లకు గొప్ప అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

లీగల్ సమస్యలు వచ్చినప్పుడు పేదప్రజలకు లాయర్లను పెట్టుకునే పరిస్థితి ఉండదని, అలాంటి వారికి  నామమాత్రం ఫీజుతో సేవలు అందించేందుకు అడ్వకేట్లు ముందుకు రావాలన్నారు. అలాగే లా స్టూడెంట్లకు ఎంపీ వంశీకృష్ణ పలు విలువైన సూచనలు చేశారు. విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజ వివేక్ మాట్లాడుతూ ఏదో ఒక రూపంలో పేదలకు సేవ చేయాలనే పట్టుదల కాకా వెంకటస్వామిలో ఉండేదన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. సదస్సులో జాయింట్ సెక్రటరీ పీవీ రమణ, సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, రోషిణి, కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సృజన, విద్యార్థులు  పాల్గొన్నారు.