Raveena Ravi: మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడు.. నటి రవీనా రవి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Raveena Ravi: మూడేళ్లుగా నరకం చూపిస్తున్నాడు.. నటి రవీనా రవి ఎమోషనల్ పోస్ట్ వైరల్!

కోలీవుడ్‍లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రవీనా రవి. 'ఒరుకిడైయిన్ కరుణై మను' చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత, 'లవ్ టుడే', 'సమస్సన్' వంటి మూవీలతో అలరించింది ఈ చిన్నది. అంతే కాకుండా ఆమె పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. తెలుగు, తమిళం, మలయాళం, కన్నద వంటి సినిమాలకు తన వాయిస్ ఇచ్చింది. నయనతార, త్రిష, నిధి అగర్వాల్. మాళవిక మోహన్, శ్రీనిధి శెట్టి, అమలా పాల్, రాశీ ఖన్నా, కాజల్ అగర్వా బ్, సమంత వంటి స్టార్ హీరోయిన్లకు వివిధ భాషల్లో డబ్బింగ్ చెప్పి మెప్పించింది. 

గత మూడేండ్లుగా వేధింపులు..

అయితే లేటెస్ట్ గా రవీనా తన సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేసింది. తనను గత మూడేండ్లుగా వేధిస్తున్న ఓ వ్యక్తి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తనతోపాటు తన కుటుంబ సభ్యులను, సన్నిహితులను వేదిస్తున్నాడని అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఇన్ స్ట్రాలో షేర్ చేసింది. ప్రజలందరికీ అవగాహన కోసమే చెబుతున్న దయచేసి ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. నా కుటుంబాన్ని, స్నేహితులను, నన్ను నేను రక్షించుకోవడావికీ ఈ పోస్ట్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది.

మౌనంగా ఉన్నా.. 

పోలీసు ఫిర్యాదులు, హెచ్చరికలతో ఇదంతా ఆగిపోతుందని ఆశించి ఇప్పటి వరకు మౌనంగా ఉన్నా. కానీ సబరీష్, అతని సోదరుడు నాపై, నా కుటుంబంపై మూడేండ్లుగా వేధింపులు కొనసాగిస్తున్నారు. అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది రవీనా. నన్ను మాత్రమే కాకుండా నాకు దగ్గరగా ఉన్నవారిని కూడా టార్గెట్ చేసుకుంటున్నరు. నా వల్ల ఈ పరిస్థితిని వచ్చినందుకు నా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబు తున్న. మేము చట్టపరమైన మార్గాలను ప్రయత్నించాము, కానీ వేధింపులు ఆగలేదని పేర్కొంది.

►ALSO READ | Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ‘సీతా పయనం’.. వాలెంటైన్స్ డే రోజు గ్రాండ్ రిలీజ్!

సీఎం స్టాలిన్ ను ట్యాగ్ చేస్తూ..

అతను వివిధ ఫేక్ అకౌంట్ల నుంచి నన్ను మాత్రమే కాకుండా.. ఇతర మహిళా నటీమణులను, ఆర్టిస్టు లను కూడా వేధిస్తున్నడు. మేము ఇప్పటికే కలిశాం. మాకు నిశ్చితార్థం జరిగింది అంటూ వంటి కల్పిత కథలను సృష్టిస్తున్నాడని నవీనా వాపోయింది.. అతని వేధింపులు తట్టుకోలేకపోతున్న. ఇలాంటి నీచులపై అధికారులు చర్యలు తీసుకుంటారని అశిస్తున్న 'అంటూ రవీనా తన పోస్ట్ రాసుకొచ్చింది.. అంతేకాకుండా సీఎం స్టాలిన్ తో పాటు చెన్నై పోలీసులకు ట్యాగ్ చేసింది. ఇది ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి రవీనా పోస్ట్ పై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raveena Ravi (@raveena1166)