యాక్షన్ కింగ్ అర్జున్ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ను వెండితెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. ఈ సినిమాపై ప్రస్తుతం భారీగానే అంచనాలు నెలకొన్నాయి. కుటుంబ అనుబంధాలకు, భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ యాక్షన్ కింగ్ అర్జున్ ఈ కథను అల్లారు. కేవలం ఒక ప్రేమకథగానే కాకుండా, ప్రతి కుటుంబం గర్వంగా చెప్పుకోదగ్గ అంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఇందులో హీరోగా నిరంజన్ నటించగా, ఐశ్వర్య అర్జున్ తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమయ్యారు.
పవర్‌ఫుల్ రోల్ అర్జున్..
ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులోని హేమాహేమీలైన నటులు.వెండితెరపై తమ నటనతో మ్యాజిక్ చేసే ఈ ఇద్దరు దిగ్గజాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తనదైన శైలిలో వినోదాన్ని పండించనున్నారు. స్వయంగా యాక్షన్ కింగ్ అర్జున్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తున్నారు. ఆయన మేనల్లుడు, కన్నడ సూపర్ స్టార్ ధ్రువ సర్జా స్పెషల్ క్యామియో రోల్‌లో కనిపించి అభిమానులకు కనువిందు చేయనున్నారు. సినిమా విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని ఇప్పటికే విడుదలైన పాటలు, కంటెంట్ చూస్తే అర్థమవుతోంది. జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా తీర్చిదిద్దారు. మాటల మాంత్రికుడు సాయి మాధవ్ బుర్రా అందించిన సంభాషణలు గుండెకు హత్తుకునేలా ఉండబోతున్నాయి. యాక్షన్ ప్రియుల కోసం కిక్ యాస్ కాళీ నేతృత్వంలో అదిరిపోయే స్టంట్ సీక్వెన్స్‌లు ఉంటాయని మేకర్స్ తెలిపారు.
పాన్ ఇండియా రిలీజ్
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డు నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతోంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ ఒక అందమైన దృశ్య కావ్యం ఈ 'సీతా పయనం'. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమా పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
►ALSO READ | Gaddar Film Awards: సినీ పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
త్వరలోనే విడుదల కాబోతున్న ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరో మెట్టు ఎక్కించడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఒక తండ్రిగా తన కూతురిని వెండితెరకు పరిచయం చేస్తూ అర్జున్ పడుతున్న ఈ తపన వెండితెరపై ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.
