
శివ భక్తుడి గొప్ప పురాణ కథగా కన్నప్ప మూవీ వచ్చేస్తోంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
కన్నప్ప రిలీజ్కు ఇంకా 4 రోజులే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచారు. వరుస అప్డేట్ట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్, ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. లేటెస్ట్గా కన్నప్ప USA ప్రీమియర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. గురువారం జూన్ 26న 3PM ESTన కన్నప్ప గ్రాండ్ USA ప్రీమియర్ షోస్ పడనున్నాయని తెలిపారు.
'పురాణం ఉదయిస్తుంది. విశ్వాసం రగిలిపోతుంది. భక్తి మరియు ధైర్యం యొక్క ఇతిహాస గాథకు సాక్ష్యమివ్వండి.. USA బుకింగ్స్ మొదలవ్వనున్నాయని ' కన్నప్ప టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. వాసరా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కన్నప్ప మూవీని USAలో విడుదల చేయనుంది.
The legend rises. The faith ignites.🔥
— Kannappa The Movie (@kannappamovie) June 23, 2025
Witness the epic saga of devotion and courage — #Kannappa roars onto the big screen with grand USA Premieres on June 26 @ 3PM EST!
Bookings Open Now
A #VasaraaEntertainment release
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥#KannappaMovie… pic.twitter.com/LzO4TfjA8H
నైజాం మరియు సీడెడ్లో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయనుంది. ఇండియాలో సైతం జూన్ 26న ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే, తెలుగు బుకింగ్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. జూన్ 24న (or) 25న సాయంత్రం బుకింగ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
An epic tale of the greatest devotee of Lord Shiva 🔱❤🔥#Kannappa in cinemas June 27th ✨
— Mythri Movie Distributors LLP (@MythriRelease) June 22, 2025
Grand Nizam and Ceded release by @MythriRelease. pic.twitter.com/IBqwWvA3Yi
కన్నప్ప మూవీలో విష్ణు తిన్నడు పాత్ర పోషించనున్నారు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే విష్ణు అందించడం విశేషం. ఇందులో కీలకపాత్రలో ప్రభాస్ నటిస్తుండటం మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
Also Read : నేషనల్ క్రష్.. నా క్రష్ కూడా.. రష్మికపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అంతేకాకుండా కన్నప్ప ట్రైలర్ చూశాక సినిమాపై మంచి అంచనాలు పెరిగిపోయాయి. అందువల్ల ఈ సినిమా విడుదల కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ అండ్ విష్ణు ఫ్యాన్స్.. ఎలాంటి హిట్ ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది.
అవా ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ మూవీని రూ.200 కోట్ల బడ్జెట్ తో మంచు మోహన్ బాబు గ్రాండ్ గా నిర్మించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి బిగ్ స్టార్స్ నటించారు.