మాసిన గడ్డంతో మాస్ లుక్‌లో చిరంజీవి

మాసిన గడ్డంతో మాస్ లుక్‌లో చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా కూడా సిద్ధమైపోతుంది. వరుసగా సినిమాలు చేస్తూ.. తన ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీ చేసేందుకు చిరు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆచార్య షూటింగ్ పూర్తయ్యింది. దీంతో మన బిగ్ బాస్ లూసీఫర్‌కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే లూసీఫర్ షూటింగ్ ఓ వైపు జరుగుతుండాగానే... మన మెగాస్టార్ మరో సినిమాకు సంతకం చేశాడు. ‘మాస్ మూలవిరాట్’ పేరుతో చిరు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.  ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. చెప్నినట్లు గానే ఇవాళ మెగాస్టార్  ‘మాస్ మూలవిరాట్ ’ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్‌లో చిరు మాస్ లుక్కలో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌లో చిరు గెడ్డంతోపాటు కళ్లజోడుతో మాస్ లుక్‌లో ఉన్నాడు. మెడలో లావుగా ఉండే చైన్‌తో పాటు.. చిరు చేతికి బ్రెస్ లెట్ కూడా ఉంది. ఇక సిగరేట్ వెలిగిస్తూ... చిరు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. 

తాజాగా విడుదలైన మెగాస్టర్ పోస్టర్‌పై టాలీవుడ్ ప్రముఖులతో పాటు.. చిరు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇక మన అన్నయ్య అరాచకం ఆరంభం అంటూ  మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశాడు. డైరెక్టర్ బాబీ కూడా దీనిపై స్పందించాడు. రెండు రోజుల ముందు అంటే దీపావళి పండగ సందర్భంగా రిలీజ్ చేసిన  పోస్టర్ కూడ  తెగ వైరల్ అయ్యింది. ఆ పోస్టర్‌లో కూడా చిరు ఓ పడవలో ప్రత్యక్షమయ్యాడు. పడవ, జెండా, ఆ జెండా కర్ర ఇలా అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. పోస్టర్లో పడవలు, వాటిపై మన జాతీయ జెండాలను చూస్తుంటే కథ మీద అందరికీ ఆసక్తి పెరుగుతోంది.  బాబీ డైరెక్షన్‌లో వస్తున్న మాస్ మూలవిరాట్  చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరిన్ని వార్తల కోసం 

యాంకర్ సుమ "జయమ్మ పంచాయితీ".. రోలు బద్దలైందిగా

‘రావణాసుర’గా మాస్ మహారాజ్