బోనాలను వైభవంగా నిర్వహిస్తం: మంత్రి తలసాని శ్రీనివాస్

బోనాలను వైభవంగా నిర్వహిస్తం: మంత్రి తలసాని శ్రీనివాస్
  • భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
  • గోల్కొండలో జరిగే ఉత్సవాలకు రూ.10 లక్షలు మంజూరు

మెహిదీపట్నం, వెలుగు: బోనాలను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గోల్కొండ కోటలో శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోల్కొండ బోనాల ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసిందన్నారు. బోనాలను ఘనంగా జరుపుకొనేలా వివిధ ఆలయాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసిందన్నారు.  

ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయాల్లో తాగునీరు లాంటి వసతులు, బారికేడ్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. బందోబస్తు కోసం అవసరమైన పోలీస్ సిబ్బందిని జిల్లాల నుంచి రప్పిస్తున్నామని ఆయన చెప్పారు. భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్ బస్సులు ఉంటాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, బల్దియా జోనల్ కమిషనర్ రవికిరణ్, దేవాదాయ శాఖ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఆలయ ఈవో శ్రీనివాస రాజు, డీఎంహెచ్​వో డాక్టర్ వెంకటి 
తదితరులు పాల్గొన్నారు.

జగదాంబిక అమ్మవారికి 216 బోనాలను సమర్పిస్తం

22న గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి ఎల్లమ్మకు మొదటి బోనంగా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 216 మంది మహిళలు బోనాలతో అంగరంగ వైభవంగా ఆలయానికి చేరుకుంటారని హైదరాబాద్ కుమ్మరి సంఘం అధ్యక్షుడు సందుగారి శ్రీనివాస్​ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 రాష్ట్రంలోని అన్ని జిల్లాల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 516 మంది మహిళలు బోనాలతో భారీ ఊరేగింపుగా ట్యాంక్ బండ్​పై ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారన్నారు. ఉత్స
వాల్లో కుమ్మరి సంఘానికి చెందిన ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు.