వినూత్నంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సచిన్

వినూత్నంగా న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సచిన్

భారత మాజీ, తాజా క్రికెటర్లు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. కొత్త ఏడాది వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని సూచిస్తూ..2023 అందరికి శుభాలు అందించాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం  సచిన్ టెండూల్కర్ విభిన్నంగా న్యూ ఇయర్ విషెస్ తెలిపాడు. బ్యాట్ తో బంతిని కొడుతున్న వీడియోను షేర్ చేస్తూ  శుభాకాంక్షలు చెప్పాడు. నాక్.... నాక్.... అక్కడ ఎవరున్నారు?  ఇది 2023 ఇయర్.  హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. 

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు ఇన్ స్టాగ్రామ్ ద్వారా న్యూ ఇయర్ విషెస్ తెలిపాడు. 

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య న్యూ ఇయర్ విషెస్ తో ట్వీట్ చేశాడు.  ప్రతి ఒక్కరూ 2023ను గొప్పగా జరుపుకోవాలని ఆకాంక్షించాడు. సురక్షితంగా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని సూచించాడు. 

షమీ, పుజారా, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి క్రికెటర్లు  తమ అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా విషెస్ పంచుకున్నారు.